తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Hamza Saleem Dar: క్రికెట్ చరిత్రలో పెద్ద రికార్డ్.. కేవలం 43 బంతుల్లోనే 193 రన్స్

టీ20 మ్యాచ్ లు అంటేనే ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తుంటారు. తమదైన స్టైల్లో బౌండరీలు బాదుతుంటారు. అయితే ఇప్పటి వరకు చూడని.. ఇక ముందు కూడా సాధ్యం కాలేని ఓ ఇన్నింగ్స్ ఆవిష్క్రతమైంది. యూరోపియన్ లీగ్ లో హమ్జా సలీమ్ దార్ ఇన్నింగ్స్ ఆసాధారణ స్థాయిలో సాగింది. ఈ బ్యాటర్ ధాటికి ప్రత్యర్థులు కళ్లు తేలేశారు. అతని బ్యాటింగ్.. కేవలం 43 బంతుల్లోనే 193 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఇందులో 22 సిక్సులు, 14 ఫోర్లతో మైదానంలో బీభత్సం సృష్టించాడు.

Also read: T20 World Cup 2024: ఆసక్తికరంగా టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ లు.. పూర్తి వివరాలివే

యూరోపియన్ క్రికెట్ లో భాగంగా టీ10 క్రికెట్ లో మంగళవారం అద్భుతం జరిగింది. కాటలున్యా జాగ్వార్ (CJG), సోహల్ హాస్పిటల్ (SOH) మధ్య జరిగిన 45వ T10 మ్యాచ్‌లో ఈ సంచలనాత్మక ఫీట్ ఆవిష్కృతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కాటలున్యా జాగ్వార్ నిర్ణీత 10 ఓవర్లలో ఏకంగా 257 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో హమ్జా సలీమ్ దార్ ఊహకందని ఇన్నింగ్స్ తో క్రికెట్ ను మైమరిపించాడు.

అతను ఏకంగా 449 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఈ స్టార్ బ్యాటర్ జట్టు స్కోర్ లో 75 శాతం పరుగులు చేయడం విశేషం. టీ10 క్రికెట్ లో ఏ ఆటగాడికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇక ఛేజింగ్ లో సోహాల్ హాస్పిటల్ 8 వికెట్లకు 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కాటలున్యా జాగ్వార్ 153 పరుగుల భారీ స్కోర్ తో గెలిచింది. ప్రస్తుతం హమ్జా సలీమ్ దార్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button