తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: ఆదుకున్న జో రూట్.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే?

రాంచీలో భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను జో రూట్(82 నాటౌట్) ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు బెన్ ఫోక్స్‌(47)తో కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. వీళ్లిద్ద‌రూ 113 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెన్ ఫోక్స్‌.. సిరాజ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్, టామ్ హార్ట్లీ క్రీజులో ఉన్నారు.

ALSO READ: ఇంగ్లాండ్ కు భారీ షాక్.. సిరీస్ నుంచి కీలక ఆటగాడు ఔట్

ఆకాశ్‌దీప్‌ 3 వికెట్లు..

టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ సేన‌ తొలి రోజు మొద‌టి సెష‌న్‌లోనే త‌డ‌బ‌డింది. భారత అరంగేట్రం బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ 3 వికెట్లతో విజృంభించగా.. రవీంద్ర జడేజా, అశ్విన్‌, సిరాజ్ చెరో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button