తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Ind Vs Aus: ఫైనల్ పోరుకు అతిరథ మహారథులు. వారిలో ప్రధానులు కూడా

ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC World Cup) ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈనెల 19న ఆదివారం అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగనున్న తుది పోరుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా, ఈ మెగాటోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ, విదేశాలతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలిరానున్నారు. ఫైనల్ మ్యాచ్ (Final Match)కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం. మ్యాచ్ కు హాజరు కావాలని ఇరు ప్రధానులకు ఐసీసీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

Also Read కాంగ్రెస్ కు జై కొట్టు.. కేసీఆర్ ను ఓడగొట్టు

ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చరిత్రాత్మక నాలుగో టెస్ట్ కు ఇరు దేశాల ప్రధానులు హాజరైన విషయం తెలిసిందే. వారిద్దరూ మైదానంలో (Stadium) కలియ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. తాజాగా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే రీతిన ప్రధానులు హాజరవుతారని తెలుస్తోంది. అయితే ఆల్బనీస్ (Anthony Albanese) పర్యటన విషయం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

Also Read సీఎం కేసీఆర్ సభలో కలకలం.. యువకుడి జేబులో బుల్లెట్లు

దేశంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తం సామర్థ్యం లక్షా 30 వేలు. ఇప్పటికే టికెట్లు అమ్ముడుపోగా తుది సమరం వీక్షించేందుకు ప్రేక్షకులు (Fans) ఎంతగానే ఎదురుచూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో భారత్ (India Team) నెగ్గి ముచ్చటగా మూడోసారి ట్రోఫీ (Trophy) సాధించాలని ఆకాంక్షిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button