తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India: టీ20 కప్ మనదే.. టీమిండియాకు ఉత్కంఠ విజయం

టీమిండియా కల నిజమైంది. 13 ఏండ్ల నిరీక్షణకు తెర పడింది. అసాధారణ పోరాటానికి ఫలితం దక్కింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా జట్టు మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని గెలిచింది. వెస్టిండీస్ గడ్డపై తిరుగులేని ఆటతో టీ20 వరల్డ్ కప్‌‌లో రెండోసారి విజేతగా నిలిచింది. విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించింది.

తన చివరి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌‌లో కింగ్ విరాట్ కోహ్లీ (76) బ్యాట్‌‌తో మెరిపించగా.. బౌలింగ్‌‌లో హార్దిక్ పాండ్యా (3/20), జస్‌‌ప్రీత్ బుమ్రా (2/18), అర్ష్​‌దీప్ సింగ్ (2/20) మురిపించగా.. నిన్న జరిగిన టైటిల్ ఫైట్‌‌లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేయగా.. ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 169/8 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. ఇండియాకు వరల్డ్ కప్‌‌ అందించిన కెప్టెన్‌‌గా రోహిత్‌‌ శర్మ దిగ్గజాలు కపిల్ దేవ్‌‌, మహేంద్ర సింగ్ ధోనీ సరసన నిలిచాడు.

దాదాపుగా చేజారిపోయిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఆఖర్లో అత్యద్భుతంగా ఒడిసి పట్టింది. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా సాగిన హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను మలుపు తిప్పితే.. హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా (3/20) తనదైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఏకంగా కప్‌‌‌‌‌‌‌‌నే పట్టేశాడు. దీంతో శనివారం జరిగిన ఫైనల్లో ఇండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (59 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 76), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 47) దంచికొట్టిన వేళ.. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 169/8 స్కోరుకే పరిమితమైంది. క్లాసెన్‌‌‌‌‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 52) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. డికాక్‌‌‌‌‌‌‌‌ (39) రాణించాడు. కోహ్లీకి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’, బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button