తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India vs England: అశ్విన్ ఖాతాల్లో 500 వికెట్లు.. భారత్ నుంచి రెండో బౌలర్‌గా రికార్డు

భారత కీలక బౌలర్ అశ్విన్ పేరిట అరుదైన రికార్డు నమోదైంది. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 500 టెస్టు వికెట్ల క్లబ్‍లో చేరాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 13వ ఓవర్ లో జాక్ క్రాలీ వికెట్ పడగొట్టాడు. దీంతో అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ALSO READ: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. ఇండియా స్కోర్ ఎంతంటే?

టెస్టు క్రికెట్‌లో తొమ్మిదో బౌలర్‌గా..

టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అశ్విన్ రికార్డుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. సీనియర్ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ 184 ఇన్నింగ్స్‌లలో 500 వికెట్లు పడగొట్టాడు. కాగా, శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ తర్వాత 100 కంటే తక్కువ టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.

ALSO READ: భారత్ కు పెనాల్టీ.. బ్యాటింగ్ చేయకుండానే ఇంగ్లాండ్ కు 5 రన్స్

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు

షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు

జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) – 695* వికెట్లు

అనిల్ కుంబ్లే (భారత్) – 619 వికెట్లు

స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604 వికెట్లు

గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563 వికెట్లు

కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519 వికెట్లు

నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) – 517* వికెట్లు

రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 500* వికెట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button