తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs South Africa: కష్టాల్లో టీమిండియా.. పోటీలో నిలిచేనా?

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో మునిగిపోయింది. సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మొదటి రోజు వర్షం కారణంగా కేవలం 59 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

Also read: BCCI: ఆస్ట్రేలియాతో మహిళల వన్డే, టీ20 సిరీస్.. జట్లు ఇవే

ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌ , సిరాజ్‌ ఉన్నారు. ముందుగా టాస్ గెలిచిన సౌతాఫిక్రా బౌలింగ్ ఎంచుకోగా.. సఫారీ బౌలర్లు భారత్‌పై పైచేయి సాధించారు. వర్షం, మరోవైపు మేఘావృతమైన వాతవరణంతో పిచ్ పేసర్లకు అనుకూలంగా మారడంతో భారత్ బ్యాటింగ్ కష్టతరంగా మారింది. ముఖ్యంగా స్టార్‌ పేసర్‌ రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. రబాడతో పాటు బర్గర్‌ 2, జానెసన్‌ ఒక వికెట్‌ సాధించారు. భారత బ్యాటర్లలో రాహుల్‌తో(80) పోరాటంతో జట్టు కాస్త పోటీలో నిలబడింది. విరాట్‌ కోహ్లి 38 , శ్రేయస్‌ అయ్యర్‌ 31 పరుగులతో పర్వాలేదన్పించారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌, రోహిత్‌ శర్మ , గిల్‌ తీవ్ర నిరాశపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button