తెలుగు
te తెలుగు en English
క్రికెట్

SAvsInd: దక్షిణాఫ్రికా సిరీస్ కు ముగ్గురు కెప్టెన్లు.. 26 నుంచి షెడ్యూల్

ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతుండగా తదుపరి దక్షిణాఫ్రికాతో ముక్కోణపు సిరీస్ ఆడనుంది. టెస్టు, వన్డే, టీ20 సిరీస్ సఫారీలతో భారత ఆటగాళ్లు ఆడనున్నారు. ఈ సిరీస్ లో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్ లను బీసీసీఐ ఎంపిక చేసింది. టెస్టులకు రోహిత్ శర్మ, వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్య కుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నారు. ఈ ముక్కోణపు సిరీస్ ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది.

Also Read: సర్వేలన్నీ కాంగ్రెస్ కే పట్టం.. 9న సర్వం సిద్ధం

దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో పలు విశేషాలు ఉన్నాయి. వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లల్లో చాలామంది టెస్టులు, టీ20లలో లేనివారే ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి కూడా విశ్రాంతినిచ్చారు. హార్దిక్ పాండ్యా గైర్హాజరు అవుతుండగా.. రోహిత్ విశ్రాంతితో వన్డేలకు రాహుల్ ను ఎంపిక చేశారు. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్లు ఇలా ఉన్నాయి.

Also Read: పోల్ స్ట్రాటేజీ గ్రూప్ ఎగ్జిట్ ఫలితాలు ఇవే.. మిగతావి

టీ20 జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్.

వన్డే జట్టు
రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, చాహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్.

టెస్టు జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రాహుల్, అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, షమీ, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

షెడ్యూల్

టీ20 సిరీస్
మొదటి మ్యాచ్ డిసెంబర్ 10, డర్బన్
రెండో మ్యాచ్ డిసెంబర్ 12, గెబర్హా
మూడో మ్యాాచ్ డిసెంబర్ 14, జొహెన్నస్ బర్గ్

వన్డే సిరీస్
తొలి మ్యాచ్ డిసెంబర్ 17, జొహన్నెస్ బర్గ్
రెండో మ్యాచ్ డిసెంబర్ 19, గెబర్హా
మూడో మ్యాచ్ డిసెంబర్ 21, పార్ల్

టెస్ట్ సిరీస్
మొదటి టెస్ట్ డిసెంబర్ 26- 30, సెంచూరియన్
రెండో టెస్ట్ జనవరి 3- 7, కేప్ టౌన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button