తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IndVsAus: భారత్ భళా.. ఓటమితో ఆసీస్ తిరుగుముఖం

ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా (Australia) ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఘోర పరాభవంతో తిరుగుముఖం పట్టింది. మనకు దక్కాల్సిన ప్రపంచకప్ (Worldcup)ను లాగేసుకున్న ఆసీస్ పై భారత యువ జట్టు కసి తీర్చుకుంది. పొట్టి ఫార్మాట్ లో 4-1తో కంగారూలను చిత్తు చేశారు. ఆఖరి మ్యాచ్ లోనూ భారత జట్టు సత్తా చాటింది. బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగిన ఐదో మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది.

Also Read రోగాలు నయం చేసే వైద్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక..

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన భారత్ (India Team) తడబడింది. పరుగులు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31: 2 ఫోర్లు, ఒక సిక్స్) మోస్తారు స్కోర్ నమోదు చేశారు. బెహ్రెన్ డార్ఫ్, డ్వార్ షుయిస్ 2 వికెట్ల చొప్పున పడపగొట్టారు.

Also Read దక్షిణాఫ్రికా సిరీస్ కు ముగ్గురు కెప్టెన్లు.. 26 నుంచి షెడ్యూల్

స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి దిగిన ఆస్ట్రేలియా మన బౌలర్ల ధాటికి తడబడింది. ఓవర్లు (Overs) ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. బెన్ మెక్ డెర్మాట్ (54: 5 సిక్సర్లు) భారీ స్కోరర్ గా నిలిచాడు. ముకేశ్ 3, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు తీశారు. ప్రపంచకప్ నుంచి భారత్ లోనే ఉన్న ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్ లోనూ పేలవ ప్రదర్శన చేసింది. వన్డే ఫార్మాట్ లో సత్తా చాటిన ఆసీస్ పొట్టి ఫార్మాట్ (T20)లో ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. ఐదు మ్యాచ్ ల్లో ఒక్కటే మ్యాచ్ గెలిచి స్వదేశం బాట పట్టింది. ఆసీస్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఈ జట్టు దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనపై దృష్టి సారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button