తెలుగు
te తెలుగు en English
క్రికెట్

INDW vs AUSW: ఫస్ట్ వ‌న్డేలో దంచి కొట్టిన హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన.. టార్గెట్ ఎంతంటే?

ముంబైలోని వాంఖ‌డేలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వ‌న్డేలో హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన దంచి కొట్టింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ ప్లేయర్లలో టాపార్డ‌ర్ విఫ‌ల‌మైయ్యారుే. తర్వాత బ్యాటింగ్ చేసిన మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు జెమీమా రోడ్రిగ్స్(82), ఓపెన‌ర్ య‌స్తికా భాటియా(49), ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్(62 నాటౌట్) రాణించారు. చివరిలో పూజా వ‌స్త్రాక‌ర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 46 బంతుల్లో 62 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్(9), స్నేహ్ రాణా(1) విఫ‌ల‌య్యారు. ఆసిస్ బౌల‌ర్లలో అషే గార్డ్‌న‌ర్, వ‌రేహ‌మ్ చెరో రెండు వికెట్లు, బ్రౌన్, మేగన్, సుథర్ ల్యాండ్, కింగ్ తలో వికెట్ తీశారు.

ALSO READ: లిఫ్ట్ లో ఇరుక్కున్న అంపైర్.. ఆగిన మ్యాచ్

ఆసీస్ తొలి ఓవ‌ర్లోనే వికెట్

ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి ఓవ‌ర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ ఓవ‌ర్‌లో ఓపెన‌ర్ హేలీ(0) ఔట‌య్యింది. ప్ర‌స్తుతం ఎలిసా పెర్రీ(11), ఫొబే లిచ్‌ఫీల్డ్(3) క్రీజులో ఉన్నారు. 10 ఓవ‌ర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. కాగా, అంతకుముందు ముంబైలోని వాంఖ‌డేలో జ‌రిగిన ఏకైక టెస్టులో ఆసీస్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button