తెలుగు
te తెలుగు en English
క్రికెట్

INDW vs AUSW: భారత్‌, ఆస్ట్రేలియా ఉమెన్స్ మూడో వన్డే.. క్లీన్‌స్వీప్‌‌పై ఆసిస్ కన్ను

సొంతగడ్డపై ముంబై వేదికగా నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడో వన్డేలో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. నేడు జరిగే చివరి మ్యాచ్‌లోనూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆసీస్ బరిలోకి దిగుతోంది. అయితే కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ వ్యూహాలు రచిస్తోంది.

సమిష్టిగా విజృంభిస్తేనే..

స్టార్‌ ప్లేయర్లతో నిండి ఉన్న కంగారూలను అడ్డుకునేందుకు మన వాళ్లు సిద్దమవుతున్నారు. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధన, యస్తిక భాటియా, జెమీమా, రిచా, హర్మన్‌, దీప్తి శర్మ, పూజ సమిష్టిగా సత్తాచాటితే విజయం సులభంగా వరించనుంది. అంతకుముందు టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బౌలర్లు విజృంభిస్తే గెలిచే అవకాశం ఉంటుంది. కాగా, చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్‌.. ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button