![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/RAM.jpg)
MS Dhoni, Ram Charan: స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ, రామ్‌చరణ్.. వీడియో వైరల్
ఇండియన్ కుభేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లో ధోనీ, సాక్షిలతో రామ్‌చరణ్, ఉపాసన జంట కలిసి చేసిన సందడి ఆకట్టుకుంటుంది. వీరంతా ఓ హోటల్లో కలుసుకున్న తర్వాత సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ALSO READ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్ కు ఫస్ట్ ప్లేస్
ప్రత్యేక ఆకర్షణగా మహీ..
ఇక ధోనీ ఐపీఎల్ ఆఖరి సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు ఈ వేడుకకు హాజరైన ధోనీ.. అక్కడ మస్త్ సందడి చేశాడు. భార్య సాక్షి సింగ్‌తో కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహీ జామ నగర్లో గుజరాతీ సంప్రదాయ నృత్యమైన దాండియా ఆడాడు. కాగా, టాలీవుడ్ నుంచి జంట మాత్రమే పాల్గొంది.