తెలుగు
te తెలుగు en English
క్రికెట్

New Zealand: సిగ్గుతో తలదించుకున్న కేన్ మామ.. వీడియో వైరల్, ఫ్యాన్స్ సెటైర్లు

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. న్యూజీలాండ్ బౌలింగ్ చేసే సమయంలో 24 ఓవర్ వద్ద కివీస్ జట్టు రివ్యూ తీసుకుంది. ఫెర్గూసన్ బౌలింగ్ లో కరుణరత్నే ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దుష్మంత్ చమీరాకు ఫుల్ టాస్ బాల్ వేశాడు.

ఈ బంతిని చమీరా అంచనా వేయలేకపోవడంతో.. అదికాస్తా ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్ కి తాకింది. దాంతో న్యూజీలాండ్ ఆటగాళ్లు అది ఔటని అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ గా ప్రకటించారు. అయినా సంతృప్తి చెందని కివీస్ ఆటగాళ్లు రివ్యూ తీసుకోవాలని కోరడంతో.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ రివ్యూకి వెళ్లాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకడం స్పష్టంగా కనిపించింది. ఇది చూసి కివీస్ ప్లేయర్లు నవ్వుకున్నారు. కేన్ విలియమ్సన్ అయితే సిగ్గుతో తలదించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐసీసీ ఏకంగా రివ్యూ ఆఫ్ ది టోర్నీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసింది. ఈ వికెట్‌ను ఎలా సవాల్ చేయాలనిపించింది కేన్ మామ అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button