తెలుగు
te తెలుగు en English
క్రికెట్

NZ VS SL: కుశాల్ పెరెరా మెరుపు ఇన్నింగ్స్‌.. 22 బంతుల్లోనే

వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్‌, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. తొలత టాసి ఓడి శ్రీలంక బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ కుశాల్ పెరెరా.. కివీస్‌ బౌలర్లపై పెరెరా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఫ్లేయర్‌గా పెరీరా రికార్డుకెక్కాడు.

ట్రావిస్‌ హెడ్‌ రికార్డుకు బ్రేక్..

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ పేరిట ఉన్న రికార్డును కుశాల్ పెరెరా బ్రేక్ చేశాడు. అంతకుముందు ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్‌.. కేవలం 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ రికార్డు నెలకొల్పగా.. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును పెరెరా బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button