తెలుగు
te తెలుగు en English
క్రికెట్

T 20: నేడే టీ – 20 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ మళ్లీ కప్పు కొట్టేనా?

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుచుకోడానికి భారత్ తహతహలాడుతోంది. ఈ రోజు జరిగే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన ఢీ కొనబోతోంది. అమెరికా, కరీబియన్ ద్వీపాల సంయుక్త ఆతిథ్యంలో గత కొద్దివారాలుగా సాగుతూ వస్తున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ తుది దశకు చేరింది. 20 జట్లు, 55 మ్యాచ్‌ల ఈ ప్రపంచ కప్ సమరం ఆఖరి అంకానికి బార్బెడాస్‌లోని బ్రిడ్జ్ టౌన్‌లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఈ రోజురాత్రి (భారత కాలమానం ప్రకారం ) 8 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ప్రపంచ నంబర్ వన్, టాప్ ర్యాంకర్ భారత్‌తో.. తొలిసారిగా ఫైనల్స్ చేరిన దక్షిణాఫ్రికా తలపడబోతోంది.

ALSO READ: ఢిల్లీని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు!

ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్న నేపథ్యంలో పోరు హోరా హోరీగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2007లో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకుంది. దీంతో రెండోసారి వరల్ట్ కప్‌ను గెలవాలని తహతహలాడుతోంది. సౌతాఫ్రికా ఇప్పటి వరకూ కప్‌ను గెలుచుకోలేదు. అందుకే ఈసారి కప్పు కొట్టాలని కసి మీద ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు ఇరు జట్ల సభ్యులతో పాటు, క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button