తెలుగు
te తెలుగు en English
క్రికెట్

T20 World Cup 2024: ఆసక్తికరంగా టీ20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ లు.. పూర్తి వివరాలివే

భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి టీ20 వరల్డ్ కప్ 2024 మీద పడింది. క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త చెప్పేసిన ఐసీసీ.. ఈ మెగా టోర్నీ పూర్తి వివరాలు వెల్లడించింది. జూన్‌ 3 నుంచి 20 వరకు సమరం జరగనుంది. 2022 లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగ్గా.. వచ్చే ఏడాది వెస్టిండీస్‌, అమెరికా సంయక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

Also read: India: బిజీ బీజీగా టీమిండియా.. మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5 వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి.

మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. 2013 నుంచి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూప్ లో ఉంటూ వస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు ఈ సారి కూడా ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి.

మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా

ఇక జట్లు ఎక్కువగా ఉండటంతో ఈసారి టోర్నీని భిన్నంగా నిర్వహించనున్నారు. గతంలో తొలి రౌండ్‌ ముగిశాక సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఈసారి 20 జట్లను ఐదేసి జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను రెండు గ్రూపులుగా ఆడిస్తారు. గ్రూప్ దశలో ఆడిన ప్రదర్శన కారణంగా సూపర్-8 షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి.

అర్హత సాధించిన జట్లు ఇవే

వెస్టిండీస్, అమెరికా ఆతిథ్య దేశాలుగా టోర్నీలో నిలవగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-10లో ఉన్నాయి కనుక డైరెక్ట్ గా అర్హత సాధించాయి. ఇక స్కాట్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్), ఐర్లాండ్ (యూరోప్ క్వాలిఫైయర్), పాపువా న్యూ గినియా (తూర్పు-ఆసియా పసిఫిక్ క్వాలిఫైయర్) నేపాల్, ఒమన్, కెనడా, ఆఫ్రికా, నమీబియా, ఉగాండా క్వాలిఫైయర్ మ్యాచ్ ల ద్వారా అర్హత సాధించాయి.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button