తెలుగు
te తెలుగు en English
క్రికెట్

U-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ సత్తా.. వరుసగా తొమ్మిదోసారి ఫైనల్ కు

అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే.. పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య మరో సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది.

సెమీస్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత్‌ ముందు 245 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ లో సచిన్ దాస్ (96), కెప్టెన్ ఉదయ్ సహారన్( 81) ఇద్దరూ కలిసి 171 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Also read: Team India: జింబాబ్వే టూర్ కు భారత్.. మ్యాచ్ షెడ్యూల్ ఖరారు

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే దెబ్బతగిలింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత అర్షిన్ కులకర్ణి 12 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ప్రియాంషు మోలియా 5 పరుగులు చేసి పెవిలియన్‌ బాటపట్టాడు. భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ కలిసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చారు. దక్షిణాఫ్రికా తరఫున ట్రిస్టన్ లూస్, మేనా ఫకా చెరో 3 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ఓపెనర్ జువాన్ డ్రే ప్రిటోరియస్ 102 బంతుల్లో 76 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. ఆ తర్వాత రిచర్డ్ సెలెస్వీన్ 64 పరుగులు చేశాడు. ఇక.. భారత్ బౌలింగ్ లో రాజ్ లింబానీ 3 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ 2.. నమన్ తివారీ, సౌమీ పాండేకు చెరో వికెట్ దక్కింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button