Salaar Trailer: యూట్యూబ్ లో సలార్ హవా.. రికార్డులన్నీ బ్రేక్
సలార్ దెబ్బకి రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. శుక్రవారం రిలీజైన సలార్ ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎంతలా అంటే.. సలార్ అండ్ నాన్ సలార్ రికార్డ్స్ అనేంతలా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అంశాలతో వచ్చిన ఈ ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో ప్రభాస్ లుక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు జనాలు మ్యాడ్ ఐపోతున్నారు.
Also read: Salaar Trailer: ఆకట్టుకుంటున్న సలార్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే
దీంతో ఈ ట్రైలర్ కేవలం 16 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 75 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్.. కేవలం 18 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ వచ్చిన మాసీవ్ రెస్పాన్స్ చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్ 22న ఇదే రెస్పాన్స్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాలా కాలం తరువాత ప్రభాస్ ను ఇలా మాస్ అవతారం చూసి పండుగ చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా సలార్ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశల్ని నిజం చేస్తుందా అనేది చూడాలి.