Nithin: శ్రీలీలపై నితిన్ కామెంట్స్.. అలా అన్నాడేంటి?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న యంగ్ బ్యూటీ శ్రీలీల.. వరుస ఫ్లాప్స్ చూస్తోంది. వరుసగా సినిమాలు సైన్ చేసిన బ్యూటీ.. ప్రస్తుతం నితిన్‌తో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల కాబోతుంది. ఇందులో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న హీరో నితిన్.. శ్రీలీల గురించి వైరల్ కామెంట్స్ చేశాడు.
Also read: Family Star: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లీక్ చేసిన దిల్ రాజు.. ఎప్పుడంటే?
‘శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉందని మీకు తెలుసు. మేము మా సినిమా షూటింగ్ చేసే సమయంలో ఆమె విషయంలో ప్రతిరోజు ఎంతో టెన్షన్ పడేవాళ్లం. ఆమె షూటింగ్ కోసం వస్తానని చెప్పినా.. వస్తుందా రాదా అన్న సందేహం ఉండేది. కానీ శ్రీలీల షూటింగ్‌కి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్లం. అలాగే తన బిజీ షెడ్యూల్ తెలుసు కాబట్టి శ్రీలీల సెట్లోకి వస్తే ఎక్కువ భాగం తనపైనే చిత్రీకరణ చేసే వాళ్లం. తాను ప్రమోషన్లకు వస్తానని చెప్పింది కానీ రాలేదు. రేపు వస్తానని చెప్పింది’ అని తెలిపాడు. కాగా నితిన్ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.