![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/siddarth-roy.jpg)
Deepak Saroj: ‘సిద్ధార్థ్ రాయ్’ ట్రైలర్… అర్జున్ రెడ్డి-2 అంటున్న నెటిజన్లు
అర్జున్ రెడ్డి’ సినిమా ప్రభావం యూత్ పై గట్టిగానే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది ఫిలిం మేకర్స్ కూడా ‘అర్జున్ రెడ్డి’ ఫోబియా నుండి బయటపడలేదని స్పష్టమవుతుంది. విపరీత ధోరణి కలిగిన వ్యక్తిగా హీరోను చూపిస్తూ రూపొందిన మరో సినిమా ‘సిద్ధార్థ్ రాయ్.’ శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ , విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థల పై జయ అడపాక నిర్మిస్తున్నారు.
Also Read: విశాల్ రత్నం మూవీ అప్డేట్.. త్వరలోనే సినిమా రిలీజ్
‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం తనయుడిగా చేసిన దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన జోడీగా తన్వి నేగి కనిపించనుంది. యశస్వి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ లో అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉన్నాయి. బోలెడంత బోల్డ్ కంటెంట్ ఉందనే సంకేతాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్డ్ ను రాబడుతుందో చూడాలి.