![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/ఇస్రో-780x470.png)
ప్రత్యేక కథనం
ISRO: అరుణగ్రహంపైకి రోబోను పంపనున్న ఇస్రో
అంగారకుడిపై ప్రయోగాల కోసం ‘మంగళయాన్’ పేరుతో ఉపగ్రహాన్ని పంపి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమవుతుంది. దాదాపు దశాబ్దకాలం పాటు సేవలు అందించిన మంగళయాన్ సేవలు 2022తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంగరాకుడిపైకి ఓ రోబోను పంపాలని యోచిస్తోంది.
Also Read: ముస్తాబైన విశాఖ బీచ్ రోడ్డు.. నేటి నుంచి మిలాన్ 2024
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్జెన్యుటీ క్వాడ్ కాప్టర్ ఇటీవలే విజయవంతంగా మూడు సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రోటోక్రాఫ్ట్ను పంపాలని ఇస్రో నిర్ణయించింది. అయితే, ఇది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఉష్ణోగ్రత, తేమ, ఒత్తిడి, గాలి వేగం, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ట్రేస్ స్పీసెస్, డస్ట్ సెన్సార్లను మోసుకెళ్తుంది.