చరిత్రలో ఈ రోజు: జూన్ 29
సచిన్ టెండూల్కర్ రికార్డు
జూన్ 29, 2007న సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్లో 15,000 పరుగులు పూర్తి చేశాడు. బెల్ఫాస్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ మైలు రాయిని దాటి వన్డే క్రికెట్లో పదిహేను వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్‌గా నిలిచారు.
జాతీయ కెమెరా దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ కెమెరా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మానవ జీవితంలో కెమెరాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జీవితంలోని అతి ముఖ్యమైన ఘటనలను, మధుర జ్ఞాపకాలను కెమెరాలో బంధించి భద్రపరుచుకుంటున్నాం.
ఫ్రాంక్ఫర్ట్ చెస్ క్లాసిక్ టైటిల్‌ను గెలుచుకున్న విశ్వనాథన్
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఫ్రాంక్ఫర్ట్ చెస్ క్లాసిక్ టైటిల్‌ను జూన్ 29, 1997న గెలుచుకున్నాడు.
జాతీయ గణాంకాల దినోత్సవం
భారత గణాంకశాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సామాజిక, ఆర్థిక ప్రణాళిక, విధాన రూపకల్పనలో గణాంకాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.
ఢిల్లీకి పూర్తి సార్వభౌమాధికారం
1998లో ఇదే రోజున ఢిల్లీకి పూర్తి సార్వభౌమాధికారం, రాష్ట్ర హోదా లభించింది. ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్‌లను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.