తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: యానిమల్

Pakka Telugu Rating : 3/5
Cast : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనీల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబిరోయ్ తదితరులు
Director : సందీప్ రెడ్డి వంగా
Music Director : మనన్ భరద్వాజ్, ప్రీతం చక్రవర్తి, శ్రేయస్ పురాణిక్, హర్షవర్ధన్, రామేశ్వర్
Release Date : 01/12/2023

తొలి సినిమా ’అర్జున్ రెడ్డి‘తో సంచలన విజయం నమోదు చేసుకున్న సందీప్ రెడ్డి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ‘యానిమల్’ సినిమా తెరకెక్కించాడు. వివిధ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ పెరగడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్ బీర్ కపూర్, రష్మికాతో పాటు బాలీవుడ్ అగ్రనటులతో తీసిన ఈ సినిమా ఎలా ఉంది? అర్జున్ రెడ్డి మాదిరి మరో సంచలన విజయం సొంతం చేసుకున్నాడా? లేదా అనేది చూద్దాం.

కథ:

నిజ జీవితంలో తండ్రీకొడుకుల కథే ఇది. స్వస్తిక్ స్టీల్స్ అధినేత.. దేశంలో అత్యంత ధనికుడు బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్). అతడి కుమారుడు రణ్ విజయ్ (రణ్ బీర్ సింగ్). దూకుడుతనం ఉన్న రణ్ విజయ్ కు బాల్యం నుంచి తండ్రి అంటే అమితమైన ప్రేమ. కానీ వ్యాపార జీవితంలో మునిగిపోవడంతో బల్బీర్ సింగ్ తన కుమారుడితో అనుబంధం ఉండదు. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే ప్రేమించిన అమ్మాయి గీతాంజలి (రష్మిక)ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు. కొన్నాళ్లకు తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకుని హుటాహుటిన భారత్ కు విజయ్ తన భార్యా పిల్లలతో కలిసి వస్తాడు. ఇక్కడకు వచ్చాక ఏం జరిగింది? అసలు ఎవరు తండ్రిపై హత్యాయత్నం జరిగింది. తండ్రీకొడుకులు కలిసిపోయారా? అనేది మిగతా కథాంశం.

Also Read గెలుపుపై కేసీఆర్ ధీమా.. కీలక నిర్ణయం

కథనం- విశ్లేషణ:
అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్నందుకున్న సందీప్ రెడ్డి అదే కోవలోకే చెందే కథనే ఎంచుకున్నాడు. కాకపోతే తండ్రీకొడుకుల అనుబంధంతో ఈ సినిమా తీశాడు. రచన, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలను సందీప్ రెడ్డి సమన్వయం చేసుకుని చక్కగా తీశాడు. అక్కడక్కడ కొంత సాగదీత.. కొంత రొటీన్ సీన్లు మినహా సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తాయి. సినిమా ప్రారంభం మిస్సయితే మిగతా కథ కొంత అర్థం కాకపోవచ్చు. ఇక క్లైమాక్స్ ఊహించని రీతిలో ఉంది.

నటీనటులు:
లవర్ బాయ్.. చాక్లెట్ బాయ్ గా కనిపించిన రణ్ బీర్ రఫ్ క్యారెక్టర్ లో కొత్తగా కనిపించాడు. ప్రత్యకమైన పాత్రకు రణ్ బీర్ పూర్తి చేశాడు. భిన్న కోణాల్లో కనిపిస్తూ తనలోని నటనను పదును పెట్టుకున్నాడు. రష్మికతో రణ్ బీర్ అనుబంధం సెట్టయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో కనిపించినా కూడా రష్మిక అందంగానే ఉంది. అనిల్ కపూర్ తండ్రి పాత్రకు న్యాయం చేశాడు. సినిమా పతాక సన్నివేశాల్లో అనిల్ తన నటనతో జీవం పోశారు. బాబీ దివోల్, తృప్తి డిమ్రి, శక్తి కపూర్, పృథ్వీరాజ్, సిద్ధార్థ్ కార్నిక్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also Read: శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్ కార్యాచరణ: చంద్రబాబు

సాంకేతిక వర్గం:

సినిమా కనులవిందుగా తెరకెక్కించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. సందీప్ రెడ్డి దర్శకత్వం సినిమాను నిలబెట్టింది. ఎడిటింగ్ బాధ్యతల బరువు మోసిన సందీప్ రెడ్డి ఎలాంటి లోపాలు లేకుండా సినిమాను తీసుకెళ్లాడు.

ప్లస్ పాయింట్స్:

రణ్ బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ

తండ్రి కొడుకుల అనుబంధం
సందీప్ రెడ్డి దర్శకత్వం, ఎడిటింగ్

మైనస్ పాయింట్స్:

పాత కథ

అక్కడక్కడ సాగదీత

పంచ్‌లైన్: తండ్రీకొడుకుల వైల్డ్ ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button