తెలుగు
te తెలుగు en English
సినిమా

Suma Kanakala నిజమా..! యాంకర్ సుమ గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందా?

వెండి తెర, బుల్లి తెర చివరకు యూట్యూబ్ తెర. ఏ తెరపై చూసినా యాంకర్ సుమ కనకాల కనిపిస్తుంటుంది. దశాబ్దాలుగా యాంకరింగ్ (Anchoring) లో ఏకచత్రాధిపత్యం సుమ సొంతం. అలాంటి సుమ (Suma Kanakala) గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కే ఉండొచ్చు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే యాజమాన్యాలతో సంబంధం లేకుండా అన్ని చానల్స్ (TV Channels)లో చక్కర్లు కొట్టేది సుమ. దర్శకుడు, నిర్మాతతో సంబంధం లేకుండా అన్ని సినిమాల ఫంక్షన్లలో ఆమెదే హడావుడి. ఎన్నో షోలు, ఎన్నో సినిమాలు, ఇప్పుడు సరికొత్తగా యూట్యూబ్ (Youtube), ఓటీటీలలో ఆమె హల్ చల్ చేస్తోంది. దీంతో ఆమె గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కే ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఆమె నిజంగా ప్రపంచ రికార్డు (World Record) సాధించిందా? ఇంతకీ ఆమె సంతోషానికి గల కారణమేమిటో తెలుసుకుందాం.

యాంకర్, నటి, నిర్మాత, యూట్యూబర్ తదితర అవతారాల్లో సుమ కనకాల మస్త్ బిజీగా ఉంది. అయితే ఆమె తాజాగా ఇన్ స్టాలో (Instagram) ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో ఏముందంటే ఆమె తాత గిన్నీస్ బుక్ (Gunnies Book)లో స్థానం సంపాదించారని ఉంది. ఆయనే నా సూపర్ హీరో (Super Hero) అంటూ పోస్టు చేసి సంబరపడింది సుమ. అయితే ఇది తెలియక కొందరు సుమ గిన్నీస్ బుక్ లోకి ఎక్కిందని అనుకుంటున్నారు.

చదవండి: పాలమ్మిండు.. పూలమ్మిండు.. కానీ సొంత కారు కొనలేదు

‘మా తాత (అమ్మమ్మ తమ్ముడు) పి.బి. మీనన్ (98 ఏళ్లు) సుదీర్ఘ కాలం పాటు న్యాయవాదిగా (Lawyer) సేవలు అందిస్తున్నారు. 73 ఏళ్ల 60 రోజుల పాటు అత్యధిక కాలం న్యాయవాద వృత్తిలో ఉన్నందుకు మీనన్ తాత గిన్నీస్ పుస్తకంలో చోటు సంపాదించుకున్నారు. మా తాత (PB Menon) నాతోపాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మా తాతయ్యే నా సూపర్ హీరో’ అని సుమ పోస్టు చేసింది. దీంతోపాటు తన తాత గిన్నీస్ బుక్ ప్రశంసా పత్రం అందుకుంటున్న ఫొటోలను జత చేసింది.

నటన, వాక్చాతుర్యం, అందానికి గడగడ మాట్లాడే లక్షణం సుమ సొంతం. వరుస షోలతో బిజీగా ఉన్న సుమ ప్రస్తుతం తన కుమారుడు రోషన్ (Roshan Kanakala)ను హీరోగా పరిచయం చేస్తోంది. కొత్త దర్శకుడు రవికాంత్ పెరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పి.విమల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొడుకును హీరోగా (Hero) పరిచయం చేయడంలో మునిగి ఉంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో (Movie సుమ ఉన్నారు.

చదవండి: IndVsAus Match తెలంగాణ పోలీసులపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button