తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Manjot Singh: మనిషి గంభీరం కానీ బంగారం.. యువతి ప్రాణం కాపాడిన ‘యానిమల్’ నటుడు

తెలంగాణ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో గంభీరమైన పాత్రలో నటించిన ఓ నటుడు ఆత్మహత్య చేసుకోబోతున్న అమ్మాయిని కాపాడి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. భవనంపై నుంచి కిందకు దూకుతున్న యువతిని అకస్మాత్తుగా వెంటనే పట్టుకుని పైకి లాగి ఆమెను బతికించాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read కూల్చేస్తాం.. పేల్చేస్తామంటే ఊకుంటామా? మంత్రి సీతక్క ఆగ్రహం

యానిమల్ సినిమాలో ‘అర్జన్ వ్యాలీ’ పాటలో ఆక్రోశంగా కనిపించే నటుడే మన్ జ్యోత్ సింగ్. అతడు 2019లో గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో చదువుతుండేవాడు. ఆ సమయంలో 18 ఏళ్ల ఓ యువతి కళాశాలలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. భవనంపై నుంచి దూకేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో అక్కడే ఉన్న మన్ జోత్ సింగ్ తక్షణమే స్పందించి ఆ అమ్మాయి ఉన్న చోటికి వెళ్లాడు. అతడు వస్తున్న విషయాన్ని గ్రహించి యువతి భవనంపై నుంచి దూకేసింది. మన్ జోత్ సింగ్ వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి దూకుతున్న యువతి చేతిని పట్టుకునేశాడు. అతి కష్టంగా ఆ అమ్మాయిని పైకి లాగేశాడు.

Also Read త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి

ఆ పాత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. యానిమల్ సినిమా విజయవంతం కావడంతో మన్ జోత్ సింగ్ కు పెద్ద ఎత్తున అభిమానులు తయారయ్యారు. యువతిని కాపాడడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మనిషి గంభీరం.. కానీ మనసు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button