తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Rakul Preet Singh: త్వరలోనే రకుల్ పెళ్లి.. ముహుర్తం ఫిక్స్

రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్.. ప్రస్తుతం తెలుగులో సక్సెస్ సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో బిజీగా ఉంది. బాలీవుడ్ లో కూడా సరైన హిట్ లేకపోవడంతో.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో పాటు.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంది. బాలీవుడ్ లో నిర్మాతగా కొనసాగుతున్న జాకీ భగ్నానితో ప్రేమాయణం సాగించింది.

Also read: HanuMan: హనుమాన్ మూవీ సంచలనం.. 15 రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్

ఇక వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చక్కెర్లు కొడుతూనే ఉంటాయి. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ జాకీ తో ఉన్న బంధాన్ని కూడా బయటపెట్టింది. ఆ తర్వాత పబ్లిక్ గానే ఇద్దరు కలిసి బయట తిరుగుతూ కెమెరాలకు చిక్కుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ కలిసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరి పెళ్లి ఫిబ్రవరి 22న గోవాలో కుటుంబ సభ్యులు, దగ్గర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందని టాక్‌. అంతేకాదు ఈ పెళ్లి ఎప్పటికి గుర్తుండి పోవాలని ప్రముఖ ఫోటో గ్రాఫర్ విశాల్‌ పంజాబీని నియమించారట. ప్రముఖులు పెళ్లిళ్లను ఇతనే షూట్ చేశారు. అంతేకాదు వీరిద్దరి పై స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయిందట. ఇప్పటికే జాకీ భాగ్నాని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం. మరి దీనిపై ఎప్పుడు ప్రకటన ఇస్తుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button