తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

HBD Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తొలి జీతం ఎంతో తెలుసా?

హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా వెలుగొందుతున్న సల్మాన్ ఖాన్ జన్మదినం నేడు. దశాబ్దాలుగా భారతీయ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న సల్మాన్ ఖాన్ ను అందరూ ‘భాయిజాన్’ అని ప్రేమగా పిలుచుకుంటారు. బాద్ష్ షా, సూపర్ స్టార్, కింగ్ వంటి బిరుదులతో పిలుచుకుంటారు. ఓటములకు చింతకుండా.. విజయాలకు పొంగిపోకుండా ప్రజలను అలరించడమే పరమావధిగా సల్మాన్ ఖాన్ జీవితం. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సల్మాన్ కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. జన్మదినం సందర్భంగా సల్మాన్ ఖాన్ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Also Read రాహుల్ గాంధీ మరో యాత్ర.. 14 రాష్ట్రాలు.. 6,200 కిలోమీటర్లు

పుట్టిన తేదీ: 27 డిసెంబర్ 1965
అసలు పేరు: అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్ ఖాన్.
తల్లిదండ్రులు
సలీమ్, సుశీలా చరక్ ఖాన్. తండ్రి స్క్రీన్ రచయిత.
తొలి సినిమా: బివి హోతో ఐసీ (1988) సహాయ నటిగా తెరంగేట్రం.
హీరోగా తొలి సినిమా: మైనే ప్యార్ కియా (1989).
స్థిర నివాసం: ఇండోర్, మధ్యప్రదేశ్

హిట్ సినిమాలు
హమ్ ఆప్కే హై కౌన్, బీవీ నెం.1, కుచ్ కుచ్ హౌతా హై, దబాంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్
అభిరుచి: పెయింటింగ్, ఈత, రాత.
రచయిత: ఖాళీ సమయాల్లో సల్మాన్ రాస్తుంటాడు. వీర్, చంద్రముఖి సినిమాలకు సల్మాన్ రైటర్ గా పని చేశారు.
– బిగ్ బాస్ హిందీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. బీయింగ్ హ్యుమన్ పేరిట ఓ ఫ్యాషన్ సంస్థను సల్మాన్ నిర్వహిస్తున్నాడు.
అరుదైన వ్యాధి: సల్మాన్ ఖాన్ కు అరుదైన వ్యాధి ఉంది. ట్రిజెమినల్ న్యూరల్జియా అనే ముఖ నరాలకు సంబంధించిన వ్యాధితో సల్మాన్ బాధపడుతుంటాడు.
తొలి సంపాదన: రూ.11 వేలు

Also Read కాంగ్రెస్ 5 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు.. రేపటి నుంచే స్వీకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button