తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Aa Okkati Adakku: అల్లరి నరేష్ కొత్త మూవీ అప్డేట్.. ‘ఓ మేడమ్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

1992లో ఈవీవీ సత్యనారాయణ తీసిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’ సరిగ్గా 32 ఏళ్ల తర్వాత అదే టైటిల్‌తో టాలీవుడ్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ హీరోగా 61వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అంకం మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో భరత లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ‘ఓ మేడమ్..’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విడుదల చేశారు.

ALSO READ: విశ్వంభర నుంచి క్రేజీ అప్ డేట్… విలన్‌పై క్లారీటి?

ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరీదా అబ్దుల్లా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, అరియనా గ్లోరీ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతో జామీ లివర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అబ్బూరి రవి కథ అందించారు. ఈ సినిమాని మార్చి 22న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button