తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pushpa2: పుష్ప2 నుంచి కీలక అప్డేట్.. 40 రోజులు.. 12 నిమిషాల గంగమ్మ తల్లి జాతర

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో.. పుష్ప పార్ట్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ తో అంచనాలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా.. ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనం ఇస్తూ.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

Also read: Poonam Pandey: నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే వైరల్ వీడియో

తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ను ఒకప్పటి జానీ మాస్టర్ అసిస్టెంట్.. ఇప్పటి కోరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ విన్నది.. తెలుసుకున్నది చిన్న న్యూస్ అయినా.. క్షణాల్లో వైరల్ గా మారింది. ఎందుకంటే, గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ ని శ్రేష్ఠి కోరియోగ్రాఫ్ చేసింది. దీంతో తన సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ వివరాలను పంచుకుంది.

’40 రోజుల పాటు జరిగిన మోస్ట్ ఇంపాక్ట్ బుల్ ఎపిసోడ్ ఆన్ స్క్రీన్ పైన దాదాపు 12 నిమిషాల పాటు ఉంటుందని తెలిపింది. పుష్ప 2 సినిమాకే ఈ ఎపిసోడ్ స్పెషల్ హైలైట్ గా నిలుస్తుందని సినిమా ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తూనే వచ్చింది. ఇక శ్రేష్ఠి కోరియోగ్రాఫర్ తన మాటల్లో ఆఫీసియల్ గా తెలపడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మూవీకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ తో పాటు.. కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. జపాన్ షెడ్యూల్ కూడా పుష్ప 2 లో హైలెట్ గా నిలిచేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఏదేమైనా గంగమ్మ తల్లి అవతారంతో పుష్ప రాజ్ ఎంట్రీ ఇచ్చిన మొదలు.. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button