తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Calling Sahasra: సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

‘జబర్దస్’ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహిస్తుండగా.. డాలిషా హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. ఈ సినిమాను షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ సంస్థలపై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేయగా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా, మేకర్స్ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా మేకర్స్ పోస్ట్ చేశారు.

స‌రికొత్తగా సుధీర్‌ లుక్..

మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో స‌రికొత్త సుధీర్‌ కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సుధీర్ ఓ కొత్త క్యారెక్టర్లలో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయేలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వైల్డ్‌ & థ్రిల్లింగ్ అంశాలతో మాసీగా తీసిన చిత్రమిది. ప్రేక్ష‌కుల ఊహలకు అందని విధంగా మలుపులు ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button