తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: దేవర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత తారక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

Also read: SSRMB: రాజమౌళి- మహేష్ మూవీ టైటిల్ ఇదేనా.. నెట్టింట చక్కర్లు

అయితే ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నించారు. కానీ.. అనుకోని విధంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీఖాన్ కు ప్రమాదం జరగడంతో దేవర సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటినుండి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ దేవర కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ 10న థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతోపాటు ఎన్టీఆర్ కు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button