తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. అలా అన్నాడేంటి?

టాలీవుడ్ దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా జూబ్లీహిల్స్ లో దేశ ద్రోహులున్నారని ఆయన చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తేజ కామెంట్స్ పై చర్చ నడుస్తోంది. మరి తేజ జూబ్లీహిల్స్లో దేశ ద్రోహులు ఉన్నారని ఎందుకు అన్నారు?

గురువారం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Also read: E-Mails: బెంగళూరులో బాంబు బెదిరింపులు.. 15 స్కూళ్లకు మెయిల్స్

అయితే డైరెక్టర్ తేజ కూడా ఓటువేసిన తర్వాత మాట్లాడాడు. ఓటింగ్ లో పాల్గొనని వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. మాములుగా చాలా మంది నీళ్లు రాలేదని, రోడ్లు బాగాలేవని, స్కూల్స్ బాగాలేవని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వారందరూ ముందు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఓటు వెయ్యని వారికి ప్రశ్నించే హక్కు లేదు. నా అభిప్రాయం ప్రకారం ఓటు వెయ్యని వాళ్లందరూ దేశ ద్రోహులతో సమానమని అన్నారు. ఆరోగ్యం బాగోలేని వాళ్లు సైతం వీల్ చైర్స్‌లో వచ్చి ఓటు వేస్తున్నారు. అనీ బాగున్నా కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు. జూబ్లీహిల్స్‌లో తక్కువ ఓటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఎక్కువ మంది దేశ ద్రోహులు ఉన్నారని అర్థం. ఎవరైతే ఓటు వేయకండా ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తున్నారో.. వాళ్లందరూ దేశ ద్రోహులే.. అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button