తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Extra Ordinary Man: ‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఫ్లోర్ స్టెప్స్ గూస్‌బంప్స్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు ‘వక్కంతం వంశీ’ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ ప్రకటించారు. ఈ మూవీ నుంచి ‘ఒలే ఒలే పాపాయి’ అంటూ సాగే మాస్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ని హరీష్ జైరాజ్ మంచి జోష్ ఫుల్‌గా కంపోజ్ చేశాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా రామ్ మిర్యాల, ప్రియా కలిసి ఓలే ఓలే పాపాయి సాంగ్‌ని పాడారు. ఇక ఈ పాట‌కు సంబంధించి ఫుల్ సాంగ్‌ను డిసెంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌నున్నారు.

ALSO READ: టాలీవుడ్ స్టార్ హీరోకు అనారోగ్యం.. షూటింగ్‌ వాయిదా

శ్రీలీల స్టెప్స్.. సాంగ్‌కే హైలైట్‌

కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఇక నితిన్ డాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా శ్రీలీల వేసిన ఫ్లోర్ స్టెప్స్ అండ్ ఫాస్ట్ డాన్స్ మూమెంట్స్ అయితే సాంగ్‌కే హైలైట్‌గా మార్చాయి. కాగా, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button