తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Family Star: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లీక్ చేసిన దిల్ రాజు.. ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు.

Also read: Animal: యానిమల్ మూవీకి సూపర్ టాక్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

తాజాగా మూవీ విడుదలపై చిత్ర నిర్మాత దిల్‍రాజు స్పందించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ జనవరిలో రావడం లేదని స్పష్టం చేశారు. ఫ్యామిలీ స్టార్ చిత్రం మార్చిలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. “సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ స్టార్ ఔట్ అయింది. 2024 మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని దిల్‍రాజు తెలిపారు. రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా తెలుగు హక్కులను దిల్‍రాజు సొంతం చేసుకున్నారు. యానిమల్ మూవీ డిసెంబర్ 1 న రిలీజ్ కాగా.. తొలి రోజున తెలుగులో ఆ సినిమా రూ.14కోట్లను రాబట్టిందని దిల్‍రాజు తెలిపారు. ఈ తొలి వీకెండ్‍లోనే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button