![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/gaami-2_V_jpg-816x480-4g-780x470.webp)
Gaami Teaser: విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘గామి’ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీకి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తుండగా.. చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ మూవీ వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ దీనిని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు గామి మేకింగ్ వీడియో విడుదల చేయగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
అఘోర శంకర్ పాత్రలో..
మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రమని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 29న విడుదల కానుండగా.. మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.