తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mahesh Babu: రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్.. ఫ్రీగా చేయనున్న సూపర్ స్టార్

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అంది మహేష్, రాజమౌళి మూవీ కోసమే అని చెప్పాలి. ఇక షూటింగ్ మొదలుకాకుండానే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

Also read: Rakul Preet Singh: త్వరలోనే రకుల్ పెళ్లి.. ముహుర్తం ఫిక్స్

ఇక తాజాగా ఈ ప్రాజెక్టు కోసం మహేష్ బాబు తీసుకోనున్న రెమ్యునరేషన్ గురించి చర్చ నడుస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోవడంలేదట. నిజానికి ఈ ప్రాజెక్టు కు సంబంధించిన ఫైనాన్సియల్ డీటెయిల్స్ అన్ని రాజమౌళినే దగ్గరుండి చూసుకుంటున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా కోసం మహేష్ కు రెమ్యునరేషన్ కాకుండా పార్టనర్ ని చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. ఈ రకంగా చూసుకున్నా కూడా మహేష్ కు ఈ సినిమా ద్వారా డబ్బులు గట్టిగానే వచ్చే అవకాశం ఉంది.

యావరేజ్ టాక్ వచ్చిన ఈ సినిమా ఈజీగా రూ.2000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయం. కాబట్టి రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగానే ఈ సినిమా ద్వారా మహేష్ బాబు నగదు అందుకోనున్నారు. అలా ఇండియా నుండి భారీ రెమ్యునరేషన్ లేదా పర్సెంటేజ్ అందుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే అధికారికంగా మొదలుకానుందని టాక్. 2025 లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button