తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Manchu Vishnu: కన్నప్ప నుంచి క్రేజీ ఆప్ డేట్…కీలక పాత్రలో మరో స్టార్ హీరో

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న కన్నప్ప నుంచి మరో క్రేజీ ఆప్ వచ్చింది. ఇప్పటికే మూవీపై అంచనాలు పెంచేసిన మంచు విష్ణు… ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చిత్రికరించనున్నారు. కన్నప్పలో శివుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని ప్రకటించి ఎక్స్పర్టేషన్స్ పెంచేసిన చిత్రబృందం ఇందులో మరో స్టార్ హీరో పేరును చేర్చింది. ఆయన ఎవరోకాదు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు మంచు విష్ణు, మోహన్ లాల్ తో దిగిన పోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప టీమ్ న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ ,విజయేంద్ర ప్రసాద్, తోటపల్లి సాయినాథ్, ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు.

మంచు మోహన్ బాబు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న మంచు విష్ణుకి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ బ్లాక్ బాస్టర్ లేదు. చూడాలి మరి ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న కన్పప్పనైనా మంచు విష్ణు కెరీర్ కి కావలసిన బ్రేక్ త్రో ఇస్తుందో లేదో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button