తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Martin Luther King: మార్టిన్ లూథర్ కింగ్ టీజ‌ర్ విడుదల… కడుపుబ్బ నవ్వుతారంటున్న సంపూర్ణేష్ బాబు

అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన మొదటి మూవీ హృదయ కాలేయంతో భారీ హిట్ అందుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు. అందులో తన నటనకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు. తర్వాత సింగం 123 తనకున్నంత పేరు తీసుకురాకున్న…కొబ్బరిమట్టతో మరో హిట్ కొట్టాడు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్‌ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు సంపూర్ణేశ్ బాబు.తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్. తాజాగా ఈ సినిమాకు సంబంధిచిన టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఓ బార్బర్ ఓటుకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు జరిగాయి అనేదే సినిమా కథ. ఇక ప్ర‌స్తుత రాజకీయాలకు సంబంధించిన సబ్జెక్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. టీజర్ చూస్తుంటే ప్రేక్షకులు థియేటర్లలో కడుపుబ్బ నవ్వుకునేలా కనిపిస్తుంది.

ఈ మూవీకి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా ఈ పొలిటికల్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button