తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Mega 156: మెగా 156 మూవీ నుంచి కీలక అప్డేట్.. చిరు సరసన సీనియర్ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి 156 మూవీ గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు.. అదే జోష్ లో మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాలో నటించారు. కానీ ఊహించని విధంగా భోళా శంకర్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెగాస్టార్ తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో మెగాస్టార్ తన 156 వ సినిమాను చేస్తున్నారు. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.

ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ షూటింగ్ ని మొదలెట్టారు. కాగా సినిమాలో చిరంజీవి సరసన పలువురు హీరోయిన్స్ ని మేకర్స్ ఇప్పటికే పరిశీలించారు. వారిలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి మెగాస్టార్ సరసన ఫిక్స్ అయినట్లు గతంలో వార్తలొచ్చాయి.

Also read: Ram Charan: రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. పోటీలో మరికొందరు స్టార్స్

కానీ ఇప్పుడు మరో హీరోయిన్ త్రిష పేరు బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ అవకాశం చెన్నై బ్యూటీ త్రిషకు దక్కినట్లు సమాచారం. త్రిష ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్, లియో వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తోంది. అయితే చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని త్రిష ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో త్రిషకి ఆ అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్లో ‘స్టాలిన్’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button