తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Movie Talk:‘హనుమాన్’ సినిమాపై దర్శకుడు కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీ కూడా ఒకరు. తన భావాలను సోషల్ మీడియా వేదికగా ఆయన తరచూ పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో ‘హనుమాన్’ మూవీపై మరోసారి స్పందించారు. ‘ఎందుకో తెలియదుగానీ ‘హనుమాన్‌’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ చిత్రమే నాకు బాగా నచ్చింది. శ్రీ ఆంజనేయం.. సూపర్‌ సినిమా. కానీ ప్రేక్షకులకు అది అర్థం కాలేదు’ అని ఓ సినీ అభిమాని పోస్ట్‌ పెట్టాడు. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ ‘ప్రేక్షకులెప్పుడూ తప్పు కాదు. వారికి సినిమా నచ్చలేదంటే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు. అంతమాత్రాన ఆడియన్స్‌ను నిందించొద్దు. ఆ సినిమా విషయంలో నేనే ఎక్కడో తప్పు చేశాను. కానీ హనుమాన్ మూవీ అలా కాదు, చాలా బాగుంది’ అని అన్నారు.

ALSO READ: వెన్నెల కిషోర్ ‘చారి 111’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్

దీనిపై నెటిజన్లు స్పందించారు. నిజాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకున్న కృష్ణవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎంత వినయంగా సమాధానం చెప్పారు సర్‌.. నిజమే ఆడియన్స్‌ ఎప్పుడూ తప్పు కాదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. కృష్ణవంశీ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘శ్రీ ఆంజనేయం’. ఇందులో నితిన్, యాక్షన్ కింగ్ అర్జున్ , ఛార్మి కౌర్ నటించారు. పిల్లా ప్రసాద్, చంద్ర మోహన్ , ఎల్బీ శ్రీరాం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button