తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pottel: ‘పొట్టేల్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

‘బంధం రేగడ్’, ‘సవారీ’ ఫేమ్ సాహిత్ మోత్ఖురి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్రంలో మల్లేశం, వకీల్‌సాబ్‌, మ్యాస్ట్రో వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ నటిస్తున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ALSO READ: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్.. అసలు కారణమేంటో?

ఆసక్తిక‌రంగా పోస్టర్

గ్రామీణ ప్రాంతంలో బోనాలు ఉత్సవాల వేడుకలను ఎమోషన్ పోస్టర్ ద్వారా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశారు. యూనిక్ కంటెంట్‌తో మోషన్ పోస్టర్ చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల భార్యాభర్తలుగా ఉత్సవాల్లో క్రతువులు నిర్వహిస్తూ కుమార్తెతో కలిసి కనిపించడం క్యురియాసిటీని పెంచింది. ఈ పోస్ట‌ర్‌లో బోనాల పండుగ హైలెట్ చేసింది. ఈ వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, జోగిని రంగం ప్రదర్శించడం వంటి చూపిస్తూ.. పోస్టర్ ఆసక్తిక‌రంగా సాగింది. ఇందులో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button