తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Salaar: ‘సలార్’ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్.. మీరూ చూసేయండి

డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా.. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా న‌టించింది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న ఈ మూవీ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. కేవలం మూడు రోజుల్లో రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా, ఈ మూవీ నుంచి ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ మేకింగ్‌ వీడియోను మేకర్స్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

ALSO READ: దేశంలో సలార్ జోరు.. ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

హార్డ్ వ‌ర్క్.. సన్నివేశాలు హైలైట్‌

అంచనాలకు తగినట్లుగానే సలార్ మూవీ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే మేకింగ్ వీడియో ఆఫ్ సలార్‌ సీజ్‌ఫైర్‌ పేరిట ఈ వీడియో విడుద‌ల చేయ‌గా.. ఇందులో ఫైట్ సీన్స్‌కి సంబంధించిన ఎలా తీశారనేది చూపించారు. కాగా, ‘సీజ్‌ఫైర్‌’ను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. ఇక సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఈ వీడియోలో చూడవ‌చ్చు. మ‌రోవైపు ప్ర‌భాస్ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో పక్కా ఎంటర్‌టైన్‌ మెంట్ అందించిన‌ట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button