తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Silk Smitha: సిల్క్ స్మితపై మరో బయోపిక్.. వచ్చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు సిల్క్ స్మిత. 1980ల‌లో అగ్ర‌హీరోల‌తో క‌లిసి న‌టించిన ఆమె తన అందాల‌తో కుర్రకారును ఓ ఊపు ఊపింది. సిల్క్ స్మిత ఉందంటే చాలు ఆ సినిమాకు బాక్సాపీస్ వ‌ద్ద‌ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురవాల్సిందే. డాన్సర్‌గా, నటిగా ఒక వెలుగు వెలిగిన స్మిత.. ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. కాగా నేడు సిల్క్‌ స్మిత జయంతి సందర్భంగా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే సిల్క్ జీవితాన్ని ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో మరో బయోపిక్‌ రానుందని తెలుస్తోంది. ఇందులో చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోండగా.. జయరామ్‌ దర్శకుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచయం అవుతున్నాడు.

ALSO READ:  ‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఫ్లోర్ స్టెప్స్ గూస్‌బంప్స్

ది అన్‌టోల్డ్‌ స్టోరీ పేరుతో..

‘సిల్క్‌ స్మిత ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్క్‌ స్మిత పుట్టినరోజు సంద‌ర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సిల్క్‌ స్మిత 1996 సెప్టెంబ‌ర్ 23న అనుమానాస్ప‌ద స్థితిలో ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంది. ఇక వెండితెర‌పై సిల్క్ స్మిత బ‌యోపిక్ ‘డర్టీ పిక్చర్‌’ రాగా విద్యాబాల‌న్ లీడ్ రోల్‌లో న‌టించి అందరి మన్ననలు పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button