తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sri Ranga Neethulu: ‘శ్రీ‌రంగ‌నీతులు’ మూవీ అప్డేట్.. ఫ‌స్ట్ సింగిల్ లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ చిత్రం `శ్రీ‌రంగ‌నీతులు`. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతుండగా.. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.

ALSO READ: శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీ ‘అమరన్’… టీజర్ రిలీజ్

విన‌రా విన‌రా చెబుతా..

ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘విన‌రా విన‌రా చెబుతా విన‌రా ఈ కాలం శ్రీరంగ నీతులు’ అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌కు అజ‌య్ అర‌సాడ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండగా.. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button