తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Amaran: శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీ ‘అమరన్’… టీజర్ రిలీజ్

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌‌ మూవీ రీసెంట్‌‌గా మొదలైంది. మరోవైపు సోనీ పిక్చర్స్‌‌తో కలిసి కమల్ హాసన్‌‌ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌‌ మూవీలోనూ నటిస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి దీనికి దర్శకుడు. శివకార్తికేయన్‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 21వ చిత్రం. తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ, ఈ మూవీ టైటిల్‌‌ను అనౌన్స్ చేశారు. ‘అమరన్‌‌’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు.

Also Read: ‘కీడా కోలా’ టీమ్‌కి లీగల్ నోటీసులు … కారణం ఏంటి?

యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో కట్ చేసిన ఈ టీజర్‌‌‌‌లో శివకార్తికేయన్‌‌ ఆర్మీ సోల్జర్‌‌‌‌గా పవర్‌‌‌‌ఫుల్‌‌ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించాడు. గ్రాండ్‌‌ విజువల్స్‌‌తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకుంది. కశ్మీర్‌లోని మిలటరీ క్యాంప్స్‌ను, అక్కడి సైనికుల జీవితాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి. ముకుంద్ వరదరాజన్ లీడ్ చేసే ‘రాష్ట్రీయ రైఫల్స్’ అనే టీమ్‌కు, సౌత్ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు మధ్య జరిగే యుద్ధంపై ‘అమరన్’ కథ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. స్టీఫెన్ రిచర్ తెరకెక్కించిన మిలటరీ రేంజ్ స్టంట్స్ యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి.

Also Read: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి

‘అమరన్’లో శివకార్తికేయన్‌కు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. రాహుల్ బోస్, లల్లూ, మీర్ సల్మాన్, గౌరవ్ వెంకటేశ్ లాంటి ఇతర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల ‘అయలాన్’ అనే చిత్రంతో క్లీన్ హిట్‌ను శివకార్తికేయన్ ఖాతాలో వేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button