తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Suhani Bhatnagar: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి

దంగల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన నటి సుహాని భట్నాగర్ కన్నుమూశారు. ఆ సినిమాలో ఆమె ఆమిర్ ఖాన్ చిన్న కూతురుగా కనిపించారు. ఆమె వయసు కేవలం 19 ఏళ్లే కావడంతో.. బాలీవుడ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫరీదాబాద్ కు చెందిన సుహానికి కొంత కాలం క్రితం ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఆమె కాలుకు తీవ్రమైన గాయం కావడంతో చికిత్స కోసం చాలా కాలం హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. అయితే.. ఆమెకి ఇచ్చిన మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్ కారణంగా శరీరంలో విపరీతంగా మార్పులు వచ్చాయి.

Also read: Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ మళ్లీ వాయిదా?

దాంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో సుహాని కన్నుమూశారు. ఆమె మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉంటుందనుకున్న సుహాని భట్నాగర్.. ఇలా ఆకస్మాత్తుగా మరణించడంతో ఆమె అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button