తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sundeep Kishan: ‘ఊరు పేరు భైరవకోన’ రికార్డు.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వ‌చ్చిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కావ్య థాపర్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ఫిబ్రవరి 16న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

ALSO READ:  ‘గుంటూరుకారం’ సినిమాపై ప్రముఖ సినీ రచయిత సంచలన వ్యాఖ్యలు

ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్..

సందీప్‌కిష‌న్ కెరీర్‌లో ‘ఊరు పేరు భైర‌వ‌కోన’ ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 6.3 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు సినిమా యూనిట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా నైజాం ఏరియాలో కోటిన్న‌ర వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. కాగా, ఈ విష‌యాన్ని సందీప్ కిషన్ తెలుపుతూ.. ”నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను’. అంటూ రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button