తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vaishnavi Chaitanya: తెలుగు హీరోయిన్ కు సూపర్ ఆఫర్.. ప్రకటించిన మూవీ టీం

బేబి’ చిత్రంతో హీరోయిన్‌‌గా పరిచయమైన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్‌‌ను అందుకుంది. ఆ చిత్ర హీరో ఆనంద్‌‌ దేవరకొండతోనే మరో సినిమాలో ఆమె నటిస్తోంది. ఇదికాక తాజాగా మరో సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఆశిష్‌‌ హీరోగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also read: Prabhas: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్

ఇందులో హీరోయిన్‌‌గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారు. గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా నేషనల్ అవార్డ్ విన్నర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button