తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tillu Square: టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫోజుతో పోస్టర్ విడుదల

డీజే టిల్లు సినిమా కుర్రకారుకు తెగ నచ్చేసింది. దీనికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న టిల్లు ప్రియులకు కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో టిల్లు, రాధిక బోల్డ్ గా కనిపిస్తూ సెగలు పుట్టించారు. సిద్ధు జొన్నలగడ్డ తొడలపై అనుపర పరమేశ్వరన్ కూర్చున్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

Also Read డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. వన్డేలకు బై బై

టీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘టికెట్టే కొనకుండా’, ‘రాధికా’ పాటలు విడుదలై ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 9కి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అనుపమ, సిద్ధూ హాట్ హాట్ గా కనిపించారు. వీరిద్దరూ కూర్చుని ఉన్న స్టిల్ సెగలు రేపుతోంది. ఒకరిపై ఒకరు కూర్చుని మైకంతో కూర్చున్న ఈ ఫోజు కుర్రకారును మత్తెక్కిస్తోంది.

Also Read మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గాయకుడు రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button