తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: అలా అయితేనే సహకరిస్తాం… సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ కీలక సూచన

రాష్ట్రంలో నేరాలను ఎదుర్కోవడంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోందని.. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతుందని… దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని.. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలకు కారణం మాదకద్రవ్యాలేనని.. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదని.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం కోరారు.

డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని సీఎం రేవంత్ అభినందించారు. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలని సూచించారు. ప్రతీ సినిమా థియేటర్‌లో సినిమా స్క్రీనింగ్‌కు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్‌కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలని కోరారు. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టంచేశారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని… తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడాలని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button