తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tollywood: జూన్ నుంచి టాలీవుడ్‌లో హంగామా షురూ!

ఐపీఎల్ సీజన్ 17 దెబ్బతో టాలీవుడ్ వెలవెలబోయింది. అన్ని సీజన్ల కంటే ఈ ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో బడా నిర్మాతలు గానీ, చిన్న నిర్మాతలు గానీ తమ సినిమాలను విడుదల చేయాలంటేనే భయపడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది. దీంతో దర్శక, నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జూన్ నుంచి టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల హంగామా కూడా మొదలవుతోంది. ప్రతి నెల ఒక భారీ బడ్జెట్ చిత్రం రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. వీటిలో ఫస్ట్ వచ్చే చిత్రంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఉంది. ఈ సినిమా జూన్ 28న వరల్డ్ వైడ్ గా 22 భాషలలో రిలీజ్ కాబోతోంది. జూలై 12న శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్‌కి పండగే!

ఇక, ఆగస్టు 15న భారీ పాన్ ఇండియా స్థాయి చిత్రం ‘పుష్ప’ ది రూల్ థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ థియేటర్స్ లోకి వస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో సుజిత్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ పై ఆవిష్కరించే పనిలో ఉన్నారు. అక్టోబర్ 10న యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్ ప్యాక్డ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. నవంబర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button